: మోదీతో పన్నీర్ సెల్వం భేటీ అనంతరం ప్రధాని కార్యాలయం స్పందన!

ప్రధాని మోదీతో తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఈ రోజు భేటీ అయ్యారు. తమిళుల సాంప్రదాయ క్రీడ జల్లికట్టును కొనసాగించేలా ఆర్డినెన్సును తీసుకురావాలంటూ ప్రధానికి ఈ సందర్భంగా పన్నీర్ విన్నవించారు. అనంతరం, వీరి భేటీకి సంబంధించిన వివరాలను ప్రధాని కార్యాలయం ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ఈ వివరాలు ఇవే...

  • జల్లికట్టుపై సుప్రీంకోర్టు నిషేధం విధించడంపై ఇరువురూ చర్చించుకున్నారు. 
  • జల్లికట్టుకు ఉన్న సంప్రదాయ నేపథ్యాన్ని మేము గౌరవిస్తున్నాం. 
  • ప్రస్తుతం ఈ విషయం కోర్టు పరిధిలో ఉందన్న విషయాన్ని ప్రధాని గుర్తించారు. 
  • జల్లికట్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కేంద్రం సమర్థిస్తోంది.
  •  తమిళనాడులో నెలకొన్న కరవుకు సంబంధించి కేంద్రం అన్ని రకాలుగా సహకరిస్తుందని పన్నీర్ సెల్వంకు ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ బృందాన్ని త్వరలోనే తమిళనాడుకు పంపుతున్నాం.

More Telugu News