: ప్రపంచంలోనే వృద్ధ గొరిల్లా ‘కోలో’ మృతి

ప్రపంచంలోనే వృద్ధ గొరిల్లా అయిన ‘కోలో’ అనారోగ్యంతో మృతి చెందింది. ఈ విషయాన్ని అమెరికాకు చెందిన జూ అధికారులు వెల్లడించారు. దాదాపు నెల రోజుల క్రితం అనారోగ్యానికి గురైన కోలో ఈ రోజు మృతి చెందిందని తెలిపారు. గత డిసెంబర్ లో కోలో 60వ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు భారీగా హాజరైన ప్రజలు, దానికి బహుమతులు కూడా అందజేశారు. సాధారణంగా గొరిల్లాలు జీవించే దాని కన్నా ఇరవై సంవత్సరాలు ఎక్కువగా కోలో జీవించడం విశేషం. అందుకే, ప్రపంచంలోనే వృద్ధ గొరిల్లాగా కోలో చరిత్ర కెక్కింది. 

More Telugu News