: కోర్టు బోనులో ఫేస్ బుక్ అధినేత మార్క్ జూకర్ బర్గ్!

ప్రపంచ ప్రఖ్యాత సోషల్ నెట్ వర్క్ ఫేస్ బుక్ అధినేత మార్క్ జూకర్ బర్గ్ కోర్టు బోను ఎక్కారు. ఎప్పుడూ కనిపించే టీషర్ట్, జీన్స్ కాకుండా, సూటులో కోర్టుకు వచ్చారు. వర్చువల్ రియాలిటీకి సంబంధించి తమ మేధో సంపత్తిని చౌర్యం చేశారని ఓక్యులస్ సంస్థ కోర్టులో దావా వేయగా... జూకర్ బర్గ్ కోర్టుకు వచ్చారు. 2014లో ఓక్యులస్ వర్చువల్ రియాలిటీ టెక్నాలజీని 2 బిలియన్ డాలర్లకు ఫేస్ బుక్ కొనుగోలు చేసింది. కొనుగోలు సమయంలో ఓక్యులస్ ఓ స్టార్టప్ కంపెనీ మాత్రమే.

ఒక స్టార్టప్ కంపెనీ గురించి మీకేం తెలుసని 2 బిలియన్ డాలర్లు వెచ్చించారంటూ మార్క్ ను న్యాయవాది ప్రశ్నించారు. దీనికి సమాధానంగా, వాస్తవానికి ఓక్యులస్ 4 బిలియన్ డాలర్లు అడిగిందని.. 700 మిలియన్ డాలర్లను ఉద్యోగులను కొనసాగించడానికే ఖర్చు చేశామని మార్క్ చెప్పారు. తమ సంస్థ భవిష్యత్తులో వర్చువల్ రియాల్టీ ముఖ్య భాగం కానుందని తెలిపారు. నెలల తరబడి ఓక్యులస్ పై ఫేస్ బుక్ పరిశోధనలు చేసిందని చెప్పారు. వర్చువల్ రియాలిటీ టెక్నాలజీని పూర్తి స్థాయిలో డెవలప్ చేయడానికి తమకు మరో 5 నుంచి 10 సంవత్సరాలు పడుతుందని చెప్పారు. 

More Telugu News