: ‘ఇది ఓ లవ్లీ’ కానుక!’ అంటున్న రామ్ చరణ్

మెగాస్టార్ చిరంజీవి నూట యాభయ్యో చిత్రం ‘ఖైదీ నంబర్ 150’ మంచి ఆదరణతో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించిన చిరంజీవి తనయుడు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు ఓ అభిమాని అద్భుతమైన ఓ కానుక అందజేశారు.  ఈ విషయాన్ని స్వయంగా రామ్ చరణ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపాడు. ఇంతకీ, ఆ అద్భుతమైన కానుక ఏమిటంటే, ‘ఖైదీ నంబర్ 150’ చిత్రం టైటిల్ లోగోను ఐస్ తో తయారు చేయడం. ఈ చిత్రం విజయం సాధించిన నేపథ్యంలో ఓ లవ్లీ అభిమాని ఈ అరుదైన కానుకను తనకు అందజేశారని చెర్రీ చెప్పాడు.  

More Telugu News