: ముస్లింలకు రిజర్వేషన్లు అమలు చేస్తాం...వచ్చే సమావేశాల్లో బిల్లు తీసుకొస్తాం: కేసీఆర్

ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. శాసనసభలో మైనార్టీ బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముస్లింల జీవన స్థితిగతులు దిగజారాయని అన్నారు. ఈ విషయాన్ని రాజేంద్ర సచార్ కమిటీ తెలిపిందని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం వేసిన సుధీర్ కమిటీ కూడా ఇదే విషయం చెప్పిందని ఆయన చెప్పారు. అందుకే తాము ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు తీసుకొస్తున్నామని చెప్పారు. తమిళనాడు తరహాలో దానిని అమలు చేస్తామని ఆయన అన్నారు. దీనికి ఉన్న న్యాయపరమైన చిక్కులను పరిశీలిస్తున్నామని ఆయన తెలిపారు.

ఈ మేరకు వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు తీసుకొస్తామని ఆయన చెప్పారు. వక్ఫ్ బోర్డుకు జ్యుడిషియల్ అధికారాలిస్తామని ఆయన వెల్లడించారు. హైదరాబాదులో ఇస్లామిక్ సెంటర్ తో పాటు అంతర్జాతీయ స్థాయిలో కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేస్తామని అన్నారు. మైనార్టీలకు 200 రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటు చేస్తామని అన్నారు. ఉర్దూ మీడియం విద్యార్థుల కోసం డీఎస్సీ నిర్వహిస్తామని ఆయన తెలిపారు. 

More Telugu News