: మీ నీతులు మాకు అవసరం లేదు... అధ్యక్షుడినైనా ఎదుర్కొంటాం: ట్రంప్ కు అమెరికన్ ప్రెస్ కార్ప్స్ లేఖ

అమెరికన్లకు వాస్తవాలను ఎలా అందజేయాలో తమకు తెలుసని... మీ నీతులు తమకు అవసరం లేదని అమెరికన్ ప్రెస్ కార్ప్స్ అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురించి తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు ట్రంప్ కు ఓ లేఖ రాసింది. మీడియా వ్యవహరించాల్సిన తీరుపై మీ అభిప్రాయాలు మీకు ఉంటే... తమ అభిప్రాయాలు తమకు ఉన్నాయని లేఖలో పేర్కొంది. ప్రజలకు వార్తలను ఎలా అందించాలో మీ నుంచి తెలుసుకోవాల్సిన స్థితిలో తాము లేమని స్పష్టం చేసింది.

అమెరికా అధ్యక్షుడి విషయాలకు తాము ప్రాధాన్యత ఇస్తామని... కానీ, అది అంత ప్రధానమైనదేమీ కాదని తెలిపింది. అధ్యక్షుడు మాట్లాడేటప్పుడు ఎంతసేపు ప్రసారం చేయాలనేది మీడియాకు సంబంధించిన వ్యవహారమని... ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దంటూ ట్రంప్ కు సూచించింది. నిష్పక్షపాతంగా వ్యవహరించని పక్షంలో దేశాధ్యక్షుడిని సైతం ఎదుర్కొంటామని చెప్పింది. అమెరికా ప్రభుత్వ సమాచారాన్ని బహిర్గతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తామని తెలిపింది. అమెరికా ప్రభుత్వంతో కలసి పని చేస్తామని... అదే సమయంలో తప్పులను ఎత్తి చూపుతామని వెల్లడించింది. ఇంతకు ముందు లేని విధంగా అత్యున్నత లక్ష్యాలను నిర్దేశించుకుని పనిచేస్తామని తెలిపింది.

More Telugu News