: దావూద్‌పై మోదీ మాస్టర్‌ స్ట్రోక్‌ ఉత్తిదే!

అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు చెందిన రూ. 15 వేల కోట్ల విలువైన ఆస్తులను యూఏఈ సీజ్ చేసిందన్న వార్తల్లో నిజం లేదని తేలిపోయింది. యూఏఈ ప్రతినిధి అహ్మద్ అల్ బనా ఈ విషయంపై మాట్లాడుతూ, ఆ వార్తల్లో నిజం లేదని తేల్చి చెప్పారు. ఆస్తులను సీజ్ చేయడం జరగాలంటే... అది యూఏఈ న్యాయ వ్యవస్థ ద్వారా మాత్రమే జరుగుతుందని ఆయన చెప్పారు. ఇప్పటి వరకు అలాంటి ప్రక్రియ మొదలు కాలేదని ఆయన స్పష్టం చేశారు.

దావూద్ ఆస్తులను యూఏఈ సీజ్ చేసిందంటూ కొన్ని రోజుల క్రితం వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. దావూద్ కు ప్రధాని మోదీ మాస్టర్ స్ట్రోక్ ఇచ్చారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. యూఏఈ పర్యటనకు వెళ్లిన మోదీ... దావూద్ అక్రమాలపై రుజువులు చూపించారని, దీని కారణంగానే దావూద్ ఆస్తులను అక్కడ సీజ్ చేశారంటూ బీజేపీ ప్రచారం చేసుకుంది. అహ్మద్ అల్ బనా వ్యాఖ్యలతో ఇదంతా ఉత్తిదే అని తేలిపోయింది. వాస్తవానికి యూఏఈ పాకిస్థాన్ కు అనుకూలంగా వ్యవహరిస్తుంటుంది. ఈ నేపథ్యంలో, పాక్ ప్రభుత్వ రక్షణలో ఉన్న దావూద్ ఆస్తులను వారు సీజ్ చేయడం దాదాపు అసంభవమనే చెప్పాలి. 

More Telugu News