: సల్మాన్ ఖాన్ ను ఆదుకున్న 'సంశయలాభం'!

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు 18 సంవత్సరాల నాటి కృష్ణ జింకల వేట కేసు నుంచి పూర్తి విముక్తి లభించింది. జింకలను వేటాడిన కేసులో ఇప్పటికే నిర్దోషిగా బయటకు వచ్చిన ఆయన, నేడు అక్రమంగా ఆయుధాలను కలిగి ఉన్న కేసు నుంచి కూడా బయటపడ్డాడు. ఈ కేసులో నూరు శాతం ఆధారాలు లేవని 'సంశయ లాభం' (బెనిఫిట్ ఆఫ్ డౌట్) కింద ఆయన్ను నిర్దోషిగా ప్రకటిస్తున్నామని న్యాయమూర్తి తన తీర్పును వెల్లడించారు.

జోధ్ పూర్ సమీపంలో 'హమ్ సాథ్ సాథ్ హై' చిత్రం షూటింగ్ కు వచ్చిన వేళ, సహ నటీనటులు సైఫ్ అలీ ఖాన్, సోనాలీ బింద్రే, నీలమ్, టబులతో కలసి ఆయన కృష్ణ జింకలను వేటాడినట్టు వార్తలు రాగా, వన్యప్రాణి చట్టాల కింద కేసులు నమోదైన సంగతి తెలిసిందే. తాము కేవలం ఎయిర్ గన్స్ పట్టుకున్నామని, అవి ఆయుధాలు కావని సల్మాన్ వాదించగా, అవి నిజమైన తుపాకులేనని ప్రాసిక్యూషన్ నిరూపించలేక పోయిందని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు.

More Telugu News