: సంచలన విషయం వెలుగులోకి... ఇటీవలి రైలు ప్రమాదాల వెనుక ఐఎస్ఐ ఉగ్రవాదుల హస్తం

ఇటీవల జరిగిన రైలు ప్రమాదాల వెనుక ఐఎస్ఐ ఉగ్రవాదుల హస్తం ఉన్నట్టు పోలీసుల విచారణలో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఇండో నేపాల్ సరిహద్దులో ముగ్గురు ఐఎస్ఐ ఏజంట్లు ఉమా శంకర్ పటేల్, మోతీలాల్ పాశ్వాల్, ముకేష్ యాదవ్ లను అదుపులోకి తీసుకున్న పోలీసులు, వారిని విచారించగా, కాన్పూర్ సమీపంలో గత సంవత్సరం జరిగిన రెండు రైలు ప్రమాదాల వెనుక ఉగ్రవాదుల హస్తం ఉందని వెల్లడైంది. రైల్వే ట్రాక్ కింద బాంబులు అమర్చినట్టు వీరు ఒప్పుకున్నారని ఎస్పీ తెలిపారు.

వీరిని ఉత్తరప్రదేశ్, బీహార్ ఏటీఎస్ విభాగం అధికారులు, నేపాల్ పోలీసుల సహకారంతో అరెస్ట్ చేశారని, వీరి నుంచి భారీ ఎత్తున పేలుడు పదార్థాలను, నగదును స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. ఇండోర్ - పాట్నా ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పిన ఘటనలో 150 మంది మరణించగా, వందలాది మందికి గాయాలైన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు పట్టాల కింద అమర్చిన బాంబులు పేలడమే కారణమని, భారత్ లో కొత్త రకం ఉగ్రవాదానికి పాక్ ప్రేరేపిత ఐఎస్ఐ ఉగ్రవాదులు తెగబడుతున్నారని, దీన్ని అడ్డుకుంటామని ఆయన తెలిపారు. నిందితులను మీడియా ముందు హాజరు పరిచిన అనంతరం కోర్టులో ప్రవేశపెట్టనున్నట్టు పేర్కొన్నారు.

More Telugu News