: ప్రవచనకర్త 'చాగంటి' యాదవులపై చేసిన వ్యాఖ్యలివే!

ప్రవచనకర్తగా తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితుడైన చాగంటి కోటేశ్వరరావు, తమ కులాన్ని అవమానించారని ఆరోపిస్తూ, అఖిల భారత యాదవ సంఘం ప్రతినిధులు ఏపీ, టీఎస్ లోని వివిధ పోలీసు స్టేషన్లలో కేసులు పెట్టిన సంగతి తెలిసిందే. ఆయన బేషరతుగా క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు చాగంటి ఏం మాట్లాడారన్నది ఓసారి పరిశీలిస్తే, ఇటీవల ఆయన ఓ బహిరంగ వేదికపై ప్రవచనాలు చేస్తున్న వేళ, శ్రీకృష్ణుడి గురించి మాట్లాడారు. "ఆయన పశువుల కాపరి ఇంట్లో పుట్టాడు. ఓ మహా విజ్ఞానవేత్తో, చక్రవర్తి కడుపున పుట్టిన వాడో కాదు. ఇంకా రామచంద్రమూర్తి అయితే, దశరధ మహారాజు కుమారుడిగా పుట్టాడు. కృష్ణుడు... ఏమీ తెలియని వాడు, తలగడిగితే మొల కడగరు, మొల కడిగితే, తల కడగరు... అటువంటి గొల్ల వాళ్ల ఇంట్లో పుట్టాడు" అంటూ నోరు జారారు. ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై మండిపడుతున్న యాదవ సంఘాలు ఆయనపై కేసులు పెడుతున్నాయి.

More Telugu News