: కొత్త పార్టీపై కోదండ‌రాం న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్య‌.. కాల‌మే స‌మాధానం చెబుతుంద‌న్న టీజేఏసీ చైర్మ‌న్‌

కొత్త‌పార్టీ పెట్ట‌డంపై టీజేఏసీ చైర్మ‌న్ కోదండ‌రాం నర్మ‌గ‌ర్భ వ్యాఖ్య‌లు చేశారు. కొత్త‌పార్టీ పెట్టేది లేద‌ని ఇటీవ‌ల స్ప‌ష్టం చేసిన ఆయ‌న తాజాగా పార్టీ విష‌యాన్ని కాల‌మే నిర్ణ‌యిస్తుంద‌ని వ్యాఖ్యానించారు. తెలంగాణ న్యాయ‌వాదుల జేఏసీ ఆధ్వ‌ర్యంలో మంగ‌ళ‌వారం  ‘ప్రత్యామ్నాయ రాజకీయాలు’ అంశంపై చ‌ర్చ జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా కోదండ‌రాం మాట్లాడారు. ప్ర‌జా వ్య‌తిరేక విధానాలను అనుస‌రిస్తున్న ప్ర‌భుత్వాన్ని వ్య‌తిరేకిస్తామ‌ని పేర్కొన్నారు.

తాజాగా హైకోర్టులో నియ‌మితులైన ఐదుగురు న్యాయ‌మూర్తుల్లో న‌లుగురు ఆంధ్రావారేన‌న్నారు. రాష్ట్రంలో రాజకీయాలు అంత బాగాలేవ‌ని జేఏసీ అభిప్రాయ‌ప‌డుతోంద‌న్నారు. తాను పార్టీ పెట్టేది, లేనిది కాల‌మే నిర్ణ‌యిస్తుంద‌ని పేర్కొన్న కోదండ‌రాం, జేఏసీ నుంచి రాజ‌కీయ అభివ్య‌క్తీక‌ర‌ణ మాత్రం ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌స్తుతం ఉన్న రాజ‌కీయాల కంటే మంచి ప్ర‌త్యామ్నాయ రాజ‌కీయాలు ఉండాల‌న్న‌ది జేఏసీ అభిప్రాయ‌మ‌ని, ఇందుకోసం ప్ర‌య‌త్నిస్తామ‌ని ఆయన పేర్కొన్నారు.

More Telugu News