: ఐసిస్ తీవ్రవాదిని కోర్టులో ప్రవేశపెట్టిన భద్రతాధికారులు.. ఏడు రోజుల రిమాండ్!

హైదరాబాదు వేదికగా పడగవిప్పేందుకు ఐసిస్ సిద్ధమవుతోందా? భాగ్యనగరిని మరోసారి రక్తసిక్తం చేసేందుకు వ్యూహాలు ఊపందుకుంటున్నాయా? అంటే ఎన్ఐఏ అధికారులు అవుననే అంటున్నారు. హైదరాబాదులో విస్తరించేందుకు ఐసిస్ చాపకిందనీరులా వ్యూహాలు అమలు చేస్తోంది. స్లీపర్ సెల్స్ ను, గతంలో ఉగ్రవాద పరిచయాలు ఉన్నవారిని వాడుకుని హైదరాబాదులో విస్తరించాలని భావిస్తోంది.

ఈ క్రమంలో ఉగ్రవాది మహ్మద్ ఇర్ఫాన్ నగరంలోని పలు చోట్ల అద్దెకు ఇళ్లు తీసుకుని సురక్షిత స్థావరాలుగా మార్చాడని ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. అతని కదలికలను గుర్తించిన భద్రతాధికారులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం న్యాయస్థానంలో హాజరుపరచగా, అతనికి ఏడు రోజుల కస్టడీ విధించింది. కాగా, ఐసిస్ కమాండర్ మహ్మద్ ఇబ్రహీం ఎజ్దానీ సూచనల మేరకే ఇర్ఫాన్ పలు ప్రాంతాల్లో అద్దెకు ఇళ్లు తీసుకున్నట్లు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు.

More Telugu News