: కాన్పూర్ రైలు దుర్ఘటన వెనుక పాక్ హస్తం: బీహార్ పోలీసుల సంచలన ప్రకటన

గత ఏడాది నవంబర్‌ లో ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ సమీపంలో 'ఇండోర్-పట్నా ఎక్స్ ప్రెస్' రైలు పట్టాలు తప్పిన దుర్ఘటనలో 140 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అంతేకాక భారీ సంఖ్యలో ప్రయాణికులు గాయపడ్డారు. దీనిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టిన బీహార్ పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. ఈ రైలు ప్రమాదం వెనుక పాక్ కుట్ర ఉందని చెబుతున్నారు. దీనికి పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ ప్రణాళిక తయారు చేయగా, కిరాయి గూండాలు అమలు చేశారని పోలీసులు చెబుతున్నారు. అతి శక్తిమంతమైన ఐఈడీ బ్లాస్ట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు వెల్లడించగా, ఈ ఐఈడీని అమర్చింది మాత్రం ఐఎస్ఐ కిరాయి గూండాలేనని, రైల్వే ట్రాక్‌ పై ఐఈడీని అమర్చి పేల్చడం వల్లే పట్టాలు తప్పాయని, దీంతో 15 బోగీలు పట్టాలు తప్పాయని వారు తెలిపారు. 

More Telugu News