: స్వప్రయోజనాల కోసం ఇతర దేశాలకు చేటు చేయొద్దు: చైనా అధ్యక్షుడు హెచ్చరిక

స్వప్రయోజనాల కోసం ఇతర దేశాలకు చేటు చేయడం మంచి పద్ధతి కాదంటూ చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ హెచ్చరించారు. దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో ఆయన మాట్లాడుతూ, వివిధ దేశాలు వాణిజ్య రంగంలో రక్షణాత్మక విధానాలకు మళ్లుతున్నాయన్నారు. 'ఇటువంటి విధానాలు ఎటువంటివి అంటే.. ప్రమాదం నుంచి తప్పించుకునే క్రమంలో చీకటి గదిలో బందీ కావడం లాంటిది. గాలి, వెలుతురు కూడా లేకుండా ఉండడం వంటిది’ అని జీ జిన్ పింగ్ చెప్పుకొచ్చారు. పారదర్శకమైన, మేలు చేసే ఒప్పందాలకు తమ దేశం కట్టుబడి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

More Telugu News