: ‘హెరిటేజ్’ పై ఆరోపణలు ఆపకపోతే చట్టపరమైన చర్యలు తప్పవు: సంస్థ అధ్యక్షుడు సాంబశివరావు

హెరిటేజ్ సంస్థపై వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు చేసిన ఆరోపణలను ఆ సంస్థ అధ్యక్షుడు సాంబశివరావు ఖండించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన చేశారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని బ్యాంకులతో ఒప్పందం చేసుకుంటే దష్ప్రచారం చేయడం తగదని, ఆరేళ్ల నుంచి బ్యాంకులతో ఒప్పందాలు చేసుకుని, రూ.231 కోట్లను రుణాల రూపంలో రైతులకు ఇచ్చామని అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ‘హెరిటేజ్’పై తప్పుడు ప్రచారాలు చేయడం మానుకోవాలని ఆయన హితవు పలికారు.  

‘హెరిటేజ్’పై ఆరోపణలు చేయడమంటే.. మూడు లక్షల మంది రైతులు, పదిహేను వేల మంది ఉద్యోగులపై దాడి చేయడమేనని అన్నారు. తమ సంస్థపై విమర్శలు చేయడం మానకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా, కేవలం హెరిటేజ్ సంస్థకు పాలు సరఫరా చేస్తున్న రైతులకు మాత్రమే మేలు చేసి, హెరిటేజ్ సంస్థను అభివృద్ధి చేసుకునే సంకుచిత ఆలోచనతో ఏపీ సీఎం చంద్రబాబు ఉన్నారని అంబటి ఆరోపించారు. ఇప్పటికైనా, తన స్వలాభం మానుకుని రాష్ట్ర  ప్రయోజనాల కోసం చంద్రబాబు పాటుపడాలని అంబటి పేర్కొన్నారు.

More Telugu News