: చంద్రబాబును కలిసిన ‘సూయెజ్ ఎన్విరాన్ మెంట్’ సీఈఓ

దావోస్ లో 47వ ప్రపంచ ఆర్థిక సదస్సు (డబ్ల్యుఈఎఫ్) కు హాజరైన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుని ప్రముఖ సూయెజ్ ఎన్విరాన్ మెంట్ సంస్థ సీఈవో కలిశారు. పారిశ్రామిక ప్రాంతాల్లో కాలుష్య నియంత్రణ, వాటర్ ట్రీట్ మెంట్ వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రాజెక్టుల్లో ఏపీ అవసరాలకు తగినట్టుగా పనిచేయాల్సిందిగా సదరు సంస్థ సీఈవోను చంద్రబాబు కోరారు. ఈ నేపథ్యంలో ఒక బృందాన్ని ఏపీకి పంపించాలని కోరారు. సూయెజ్ ఎన్విరాన్ మెంట్ సంస్థ కార్యకలాపాలు భారత్ లో ఇప్పటికే కొనసాగుతున్నాయని, అలాగే, జోర్డాన్ లో సాగు నీటి అవసరాలకు వాడే నీటిలో పది శాతం నీరు సూయెజ్ ట్రీట్ మెంట్ ద్వారా సరఫరా అవుతోందని చంద్రబాబు చెప్పారు. కాగా, జూరిచ్ కు చెందిన బ్రూనో సాటర ను చంద్రబాబు కలిశారు. సాంకేతిక అంశాల్లో ముందున్న జూరిచ్, త్వరలో ఏపీకి ఒక బృందాన్ని పంపిస్తుందని బ్రూనో పేర్కొన్నారు. స్విట్జర్లాండ్ బ్యాంకింగ్ కార్యకలాపాల్లో డిజిటల్ లావాదేవీల గురించి చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు.

More Telugu News