goutami putra satha karni: ‘శాతకర్ణి’ సినిమాలో చరిత్రను వక్రీకరించారు.. వినోదపు పన్ను మిన‌హాయింపు ఇవ్వ‌ద్దు: వాయిస్‌ ఆఫ్‌ తెలంగాణ అధ్యక్షుడు

నిన్న విడుద‌లైన  నందమూరి బాలకృష్ణ 100వ చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’  సినిమాలో చరిత్రను వక్రీకరించారని వాయిస్‌ ఆఫ్‌ తెలంగాణ అధ్యక్షుడు పాండురంగారెడ్డి అన్నారు. అలాగే, ఫక్తు లాభాపేక్షతో తీసిన చిత్రానికి వినోదపు పన్ను రాయితీ ఇవ్వడం ఎందుక‌ని, ఆ చిత్రానికి గానూ ప్ర‌క‌టించిన వినోద‌పు ప‌న్ను మిన‌హాయింపు  జీవోను ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. ఆ జీవోను ఉపసంహరించకపోతే తాను న్యాయ‌స్థానం మెట్లు ఎక్కుతాన‌ని పేర్కొన్నారు.

ఇదిలా ఉంచితే, గౌత‌మిపుత్ర  శాత‌క‌ర్ణి సినిమాకి ఏపీ స‌ర్కారు నిబంధనలకు విరుద్ధంగా వినోదపు పన్ను మినహాయించింద‌ని నిన్న హైకోర్టులో ఓ న్యాయ‌వాది పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే, కోర్టు సెలవుల నేపథ్యంలో రెగ్యులర్‌ బెంచ్‌కు వెళ్లాలని ఆయ‌న‌కు కోర్టు చెప్పింది.

More Telugu News