attack: బాలికపై కత్తితో దాడి చేసిన ఉన్మాది... దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన స్థానికులు

విశాఖప‌ట్నంలోని కస్తూరి నగర్‌లో పండుగ పూట దారుణం చోటుచేసుకుంది. ఆ గ్రామంలోని ప్ర‌జ‌లంద‌రూ భోగి పండుగ వేడుక‌లను జ‌రుపుకుంటుండ‌గా ఓ ఉన్మాది వీరంగం వేశాడు. క‌త్తితో వీధిలోకి వ‌చ్చి పదేళ్ల బాలిక జాస్మిన్ గొంతుకోసి, అనంత‌రం పారిపోయే ప్ర‌య‌త్నం చేశాడు. ఈ దారుణాన్ని గ‌మ‌నించిన స్థానికులు ఉన్మాదిని వెంబ‌డించి ప‌ట్టుకుని, అత‌డికి దేహ‌శుద్ధి చేసి స్థానిక‌ పోలీసుల‌కు అప్ప‌గించారు.

బాధిత బాలిక‌ను వెంట‌నే ఆసుప‌త్రికి త‌ర‌లించి, చికిత్స అందిస్తున్నారు. ఆ బాలిక ఓ కానిస్టేబుల్ కూతురు అని తెలుస్తోంది. ఆ బాలిక‌ పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఆమెపై దాడి జ‌రిపిన ఆ ఉన్మాది ఆ అమ్మాయి ఉంటున్న ప‌క్క వీధిలోనే ఉంటాడ‌ని, అత‌డి మాన‌సిక ప‌రిస్థితి బాగోలేద‌ని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘ‌ట‌న‌పై మ‌రింత స‌మాచారం అందాల్సి ఉంది.  


More Telugu News