: ఉభయ గోదావరి జిల్లాల్లో సంక్రాంతి కోడి పందేల బెట్టింగ్ ఎంతో తెలిస్తే దిమ్మతిరిగిపోతుంది!

సంక్రాంతి రాకతో ఉభయ గోదావరి జిల్లాలు సందడిగా మారాయి. వివిధ ప్రాంతాల్లో ఉన్న కోడి పందెం రాయుళ్లంతా తమ తమ ఊర్లకు చేరుకున్నారు. కరెన్సీ కొరత కూడా కోడిపందేలకు అడ్డుకట్ట వేయలేకపోయింది. మూడు రోజుల పాటు జరిగే కోడిపందేలకు ఉభయ గోదావరి జిల్లాల్లో ఇప్పటికే ఏకంగా రూ. 900 కోట్ల బెట్టింగ్ కాశారట. రాజకీయవేత్తల అండ కూడా ఉండటంతో పందెంరాయుళ్లు ఫుల్ జోష్ లో ఉన్నారు. ఒక్కో చోట ఒక్కో గేమ్ కు రూ. కోటి నుంచి రూ. 15 కోట్ల వరకు బెట్టింగులు జరుగుతున్నట్టు సమాచారం. మరోవైపు కోడిపందేలు జరుగుతున్న ప్రాంతాలు క్రికెట్ స్టేడియాలను తలపిస్తున్నాయి. నగదు కొరతతో కొందరు ఎన్నారైలు తమ ల్యాప్ టాప్ ద్వారా నగదు ట్రాన్స్ ఫర్ చేస్తున్నారట. 

More Telugu News