: జోరందుకున్న కోడిపందేలు... నిర్వ‌హించ‌వ‌ద్ద‌ని ఆందోళ‌నకు దిగిన మహిళలు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని అన్ని ప్రాంతాల్లో సంక్రాంతి సంబ‌రాలు ప్రారంభ‌మ‌య్యాయి. అన్ని ప‌ల్లెలూ సంక్రాంతి శోభ‌ను సంత‌రించుకున్నాయి... సంప్ర‌దాయ పోటీల‌కు వేదిక‌ల‌వుతున్నాయి. ప‌శ్చిమ‌గోదావరి జిల్లాలోని ప‌లు చోట్ల కోడి పందేలు ప్రారంభ‌మ‌య్యాయి. కోడిపందేలు చూడ‌డానికి స్థానికులు, పందెంరాయుళ్లు త‌ర‌లివ‌స్తున్నారు. అయితే, జిల్లాలోని వీర‌వాస‌రం మండ‌లం ఉత్త‌ర‌పాలెంలో మ‌హిళ‌లు ఆందోళ‌న చేప‌ట్టారు. కోడిపందేలు నిర్వ‌హించ‌వ‌ద్ద‌ని ఆందోళ‌నకు దిగారు.

మ‌రోవైపు భీమ‌వ‌రంలో ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త ర‌ఘురామ‌కృష్ణంరాజు కోడిపందేల‌ను ప్రారంభించారు. కాగా, కృష్ణా జిల్లా గుడివాడ‌లో పోటీపోటీగా కోడిపందేలు కొన‌సాగుతున్నాయి. వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని, మాజీ ఎమ్మెల్యే రావి వ‌ర్గీయుల ఆధ్వ‌ర్యంలో కోడిపందేలు జ‌రుగుతున్నాయి.

More Telugu News