: పెంపుడు జంతువుల సాయంతో భారత్ లో విధ్వంసానికి ఉగ్రవాదుల కుట్ర.. నిఘావ‌ర్గాల హెచ్చ‌రిక‌

ఈ నెల‌లో అత్యంత‌ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని దేశంలోని అన్ని ఎయిర్‌పోర్టుల‌కి నిఘావ‌ర్గాలు హెచ్చ‌రిక‌లు జారీ చేసిన సంగ‌తి విదిత‌మే. ఈ నెల 26న గ‌ణ‌తంత్ర వేడుకలు జరగనున్న సందర్భంగా దేశంలో ఉగ్రవాదులు కొత్త రకం దాడులకు పాల‍్పడే అవకాశముందని ఈ రోజు మ‌రోసారి హెచ్చరించింది. ఉగ్ర‌వాదులు ఈ సారి కుక్క‌లు, పిల్లులు, ఎలుకలను ఆత్మాహుతి దాడి చేసే జంతువులుగా మార్చి వాటి సాయంతోనే దాడుల‌కు దిగాల‌ని చూస్తున్నార‌ని తెలిపింది. డీఎన్ఏ రిపోర్టుల ప్రకారం దేశంలోని ఢిల్లీ, ముంబయ్, అహ్మదాబాద్ వంటి పలు ప్రధాన ప్రాంతాలను ఉగ్ర‌వాదులు ల‌క్ష్యంగా పెట్టుకున్నార‌ని చెప్పింది.

గణతంత్ర వేడుకల నేప‌థ్యంలో ఉగ్ర‌వాదులు కుక్కలతో ఆత్మాహుతి దాడికి దిగాల‌ని ప్ర‌ణాళిక‌లు వేసుకుంటున్నార‌ని తెలిపింది. చ‌లికాలంలో పెంపుడు జంతువుల‌కు స్వెట్టర్లను వేసే విధానాన్ని అవ‌కాశంగా తీసుకొని వాటిల్లో బాంబులు పెట్టి పంపాల‌న్న‌దే ఉగ్ర‌వాదుల ఆలోచ‌న అని పేర్కొంది. బాంబులు అమర్చిన జంతువులను రద్దీగా ఉన్న చోటుకు పంపించి, రిమోట్ కంట్రోల్ ద్వారా ఈ దాడులు చేయాల‌ని ఉగ్ర‌వాదులు భావిస్తున్నార‌ని తెలిపింది. గ‌తంలో ఉగ్ర‌వాదులు జంతువులను ఉప‌యోగిస్తూ మొట్ట‌మొదటి సారిగా సిరియాలో దాడులు చేశారు.

More Telugu News