: డీజిల్-ఎలక్ట్రిక్ సబ్ మెరైన్ ఐఎన్ఎస్ ఖండేరి ప్రారంభం

ఫ్రాన్స్ సహకారంతో నిర్మించిన స్కార్పీన్ శ్రేణి డీజిల్-ఎలక్ట్రిక్ సబ్ మెరైన్ ఖండేరిని ముంబయిలోని మాజగావ్ డాక్ బిల్డర్స్ లో ఈరోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సుభాష్ భమ్రే, నేవీ చీఫ్ అడ్మిరల్ సునీల్ లాంబా తదితరులు హాజరయ్యారు. కాగా, ఫ్రాన్స్ సహకారంతో మొత్తం ఆరు సబ్ మెరైన్లు నిర్మిస్తున్నారు. ఇందుకుగాను చేసుకున్న ఒప్పందం విలువ దాదాపు రూ.19 వేల కోట్లు. భారత నావికా దళం వద్ద ఇప్పటికే 13 సాధారణ సబ్ మెరైన్లు, రెండు అణు జలాంతర్గాములు ఉన్నాయి. తాజాగా, నావికాదళం అమ్ముల పొదిలో ఐఎన్ఎస్ ఖండేరి చేరడం విశేషం. అయితే, కల్వారీ పేరుతో ఇప్పటికే స్కార్పియన్ శ్రేణి సబ్ మెరైన్ ఒకటో దశ పరీక్షలు పూర్తి చేసుకుంది. త్వరలో ‘కల్వారీ’ని కూడా భారత నావికాదళానికి అందజేయనున్నారు.

 

More Telugu News