: ఇకపై నెలకు రూ.10 వేల పింఛన్ అందుకోనున్న లాలూ ప్రసాద్!

రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఇకపై ప్రతి నెలా పింఛన్ అందుకోనున్నారు. ‘జేపీ సేనాని సమ్మాన్’ పింఛన్ పథకంలో భాగంగా నెలకు రూ.10 వేల నగదు ఆయనకు అందుతుందని బీహార్ ప్రభుత్వం పేర్కొంది. ఈ పథకం కింద లాలూ చేసుకున్న దరఖాస్తును పరిశీలించామని, పింఛన్  పొందేందుకు ఆయన అర్హుడని రాష్ట్ర హోంశాఖ అధికారి ఒకరు తెలిపారు. కాగా, 1974లో జయప్రకాష్ నారాయణ్ సంపూర్ణ క్రాంతి ఉద్యమం ప్రారంభించిన సమయంలో లాలూ విద్యార్థి నాయకుడిగా ఉన్నారు. ఈ ఉద్యమంలో పాల్గొన్న లాలూ, నిర్వహణ అంతర్గత భద్రతా చట్టం (మిసా) కింద జైలుకు వెళ్లారు. అయితే, 2015లో ఈ పథకాన్ని సవరించారు. సవరించిన నిబంధనల ప్రకారం, ఒక నెల నుంచి ఆరు నెలల వరకు జైల్లో ఉన్న వారికి రూ.5 వేలు, ఆరు నెలలకు పైగా జైలు జీవితం గడిపిన వారికి రూ.10 వేలు పింఛన్ గా ఇవ్వాలి. 

More Telugu News