: ముల్లాలు ఇచ్చే తలాఖ్ సర్టిఫికేట్లు చెల్లవు: మద్రాసు హైకోర్టు

ముల్లాలు ఇచ్చే సర్టిఫికేట్లు చెల్లవంటూ మద్రాసు హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. విడాకులు మంజూరు చేసే అధికారం ఖాజీలకు లేదని, ఖాజీలిచ్చే తలాఖ్ సర్టిఫికేట్లు చెల్లవని ప్రకటించింది. మద్రాసు హైకోర్టు తీర్పుపై మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ముస్లిం మహిళల వివాహ సంబంధిత హక్కులు బలోపేతమవుతాయని వారు పేర్కొంటున్నారు. ఇకపై పురుషులు యథేచ్ఛగా విడాకులిచ్చే అవకాశాలు ఉండవని వారు పేర్కొంటున్నారు. తలాఖ్ ను పురుషులు దుర్వినియోగం చేస్తున్నారని, దానిని మహిళలను ఇబ్బందిపెట్టే అస్త్రంగా మార్చుకుంటున్నారని వారు ఆరోపించారు. దీంతో తలాఖ్ దుర్వినియోగమవుతోందని వారు తెలిపారు. 

More Telugu News