: చంద్రబాబు ముందే వైఎస్సార్ ను పొగిడిన కడప ఎంపీ!

కడప జిల్లా పైడిపాలెం ఎత్తిపోతల పధకాన్ని ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సాక్షిగా దివంగత రాజశేఖరరెడ్డిని కడప ఎంపీ అవినాష్ రెడ్డి పొగిడారు. పైడిపాలెంలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం చంద్రబాబు ఎదుట మాట్లాడుతూ, పులి వెందులకు కృష్ణా జలాలు వస్తున్న సందర్భం, అందర్నీ సంతోషంలో ముంచెత్తిందని అన్నారు.

ఈ ప్రాజెక్టుకు వైఎస్సార్ శంకుస్థాపన చేసి, 650 కోట్లతో పనుల్ని ఇంచుమించు పూర్తిచేశారు. మిగిలిన పనులు టీడీపీ ప్రభుత్వం పూర్తి చేయడంతో రాజశేఖరరెడ్డి కల నెరవేరిందని అన్నారు. అలాగే 2012-13 శనగపంట బీమా గురించి చాలా సార్లు విన్నవించినా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన అన్నారు. అలాగే ఎస్సీఎస్టీ కాలనీల్లో విద్యుత్ బకాయిలు ప్రభుత్వమే చెల్లించాలని కోరారు. వెంటనే సీఎం కల్పించుకుని, దేశంలోనే మొట్టమొదటి సారిగా ఏపీలో ఎస్సీఎస్టీలకు 50 యూనిట్ల వరకు ఫ్రీగా విద్యుత్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వమని స్పష్టం చేశారు. 

More Telugu News