: చైనాకు చుక్కలు చూపుతున్న పాక్ ఉగ్రవాదులు!

ఉగ్రవాదుల తయారీ కేంద్రం పాకిస్థాన్ అనే విషయం తెలిసినా... ఇన్నాళ్లు చైనా ఆ దేశాన్ని నెత్తిన పెట్టుకొని మోసింది. తీరా ప్రమాదం తన వరకు వచ్చేసరికి జాగ్రత్త పడుతోంది. పాక్ బోర్డర్ కు దగ్గరగా ఉన్న జిన్జియాంగ్ ప్రావిన్స్ లో ఇటీవల కాలంలో ఉగ్రవాద కార్యకలాపాలు ఎక్కువయ్యాయి. డిసెంబర్ 28న హోటన్ ప్రాంతంలో ఐదుగురిని ఉగ్రవాదులు చంపేశారు. ఈ క్రమంలో, ఆదివారం నాడు సోదాలు జరిపి... ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా సిబ్బంది కాల్చి చంపారు.

పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల్లో శిక్షణ పొందిన ఉగ్రవాదులు జిన్జియాంగ్ ప్రావిన్స్ లోకి చొరబడి, దాడులకు తెగబడే అవకాశం ఉందని స్థానిక కమ్యూనిస్ట్ పార్టీ నేతలు భయపడుతున్నారు. ముఖ్యంగా పాక్ నుంచి ఉగ్రవాదుల వలసలు ఎక్కువగా ఉన్నాయని వారు చెబుతున్నారు. ఈ క్రమంలో, ఉగ్రవాదుల చొరబాట్లను పాక్ అడ్డుకోవడం లేదనే అసంతృప్తి చైనాలో ఉంది. దీంతో, అవసరమైతే సరిహద్దును సైతం మూసివేయాలని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది. అంతేకాదు బోర్డర్ లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తోంది

More Telugu News