: మన భూగర్భ జలాలు తగ్గిపోవడానికి.. హిందూ మహాసముద్రం వేడెక్కడానికి లింకుంది!

హిందూ మహాసముద్రంలోని జలాలు వేడెక్కడానికి, మన దేశంలోని భూగర్భ జలాలు తగ్గిపోవడానికి మధ్య సంబంధం ఉందని ఓ తాజా అధ్యయనం తేల్చింది. గుజరాత్, గాంధీనగర్ ఐఐటీ పరిశోధకుల నేతృత్వంలో పలు దేశాల శాస్త్రవేత్తలు ఈ అధ్యయనం చేశారు. తక్కువ స్థాయి వర్షపాతం నేపథ్యంలో, హిందూ మహాసముద్రం వేడెక్కుతోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. సముద్ర జలాలు వేడెక్కడానికి, భూగర్భ జలాలు తగ్గిపోవడానికి మధ్య ఉన్న సంబంధాన్ని తాము తొలిసారిగా గుర్తించామని ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు తెలిపారు. వర్షపాతం తగ్గడం భూగర్భ జలాలు క్షీణించడానికి దారి తీస్తుందని చెప్పారు.

More Telugu News