: మున్ముందు ఎన్నో సవాళ్లు... మీ తంటాలు మీరు పడండి, గుడ్ బై: ఒబామా

ఎనిమిదేళ్ల పాటు అమెరికా అధ్యక్షుడిగా పాలన సాగించిన అధ్యక్షుడు బరాక్ ఒబామా బరువైన హృదయంతో జాతిని ఉద్దేశించి తన ఆఖరి ప్రసంగంలో కీలక వ్యాఖ్యలు చేశారు. దేశం మున్ముందు ఎన్నో పెను సవాళ్లను ఎదుర్కోవాల్సి వుందని, కొత్త అధ్యక్షుడి నేతృత్వంలో ప్రభుత్వం వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అన్నారు.

"ఎన్నికల వ్యవస్థలో తమ పాత్ర ఎంతన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా, ప్రతినిధులను ఎన్నుకోవాల్సి వస్తోంది. వలసవాదులపై వ్యతిరేకత కూడదు. అన్నింటికీ మించి ప్రతి ఆర్థిక సమస్యనూ కొత్త కోణాల్లో చూడటాన్ని మానుకోవాలి. నిరుద్యోగుల పేరు చెప్పి పబ్బం గడుపుకోవాలని చూడకుండా, వారిలో మరింత నైపుణ్యం పెరిగేందుకు చర్యలు తీసుకోవాల్సి వుంది" అని పేరును చెప్పకుండానే డొనాల్డ్ ట్రంప్ కు ఒబామా సలహాలు ఇచ్చారు.

అధ్యక్షుడిగా తన విజయం తరువాత అమెరికాపై అంతకుముందున్న జాతి వివక్ష ముద్ర తొలగిపోయిందని, ఇరవై, ముప్పై ఏళ్ల నాటి పరిస్థితి ఇప్పుడు లేదని చెప్పుకొచ్చారు. ఇస్లాం గురించి మాట్లాడుతున్నామని చెప్పుకుంటూ, ఉగ్రవాద వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న వారిపై కఠినంగా ఉండాలని చెబుతూనే, అందరు ముస్లింలనూ దూరం పెట్టాలని భావించడం దేశానికి మంచిది కాదని అన్నారు. ఎదురు కాబోయే సమస్యలను కొత్త ప్రభుత్వమే పరిష్కరించాల్సి వుందని తెలిపారు. "మనం చేశాం. మనం చేయగలం" అంటూ తన ప్రసంగాన్ని ముగించారు.

More Telugu News