: సంక్రాంతి కోసం మరో ఆరు ప్రత్యేక రైళ్లు... వివరాలివి!

సంక్రాంతి పండగ కోసం స్వగ్రామాలకు వెళ్లాలని భావించి, అటు రైళ్లలోనూ, ఇటు బస్సుల్లోనూ టికెట్లు లభించని వారికి శుభవార్త. మరో ఆరు ప్రత్యేక రైళ్లను వివిధ ప్రాంతాలకు వేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే కొద్దిసేపటి క్రితం ప్రకటించింది. కాకినాడ - సికింద్రాబాద్, కాకినాడ - నాందేడ్ మధ్య నాలుగు, మధురై - విజయవాడ మధ్య రెండు రైళ్లను వేశామని, ఇవి ఈ నెల 13 నుంచి 16 మధ్య తిరుగుతాయని, ఈ రైళ్లలో రిజర్వేషన్లను నేటి నుంచి ప్రారంభించామని ఓ ప్రకటనలో తెలిపింది. రైల్వే ప్రయాణికులు ఈ ప్రత్యేక రైళ్లను వినియోగించుకోవాలని కోరింది.

More Telugu News