: అమరావతి సమస్యే నా 150వ సినిమా: చిరంజీవి

'కార్పొరేట్ అవసరాల పేరుతో కొండ, మెట్ట భూములను వదిలేసి, రైతులు సాగుచేసే భూములు, మూడు పంటలు పండే భూములను ప్రభుత్వాలు తీసుకోవడంపై పోరాటమే ఈ సినిమా' అని చిరంజీవి తన ఖైదీ నంబర్ 150 సినిమా గురించి చెప్పారు. వెంటనే హోస్ట్ రోజా మాట్లాడుతూ, 'అవును నిజమే.. ఇది బర్నింగ్ పాయింట్. అమరావతి రైతులు భూములు కోల్పోయారు' అన్నారు రోజా. దీంతో అందుకున్న చిరంజీవి, రైతుల ఆత్మహత్యలు కూడా పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అందరికీ అన్నం పెట్టే రైతన్న నిండా కష్టాల్లో ఉన్నాడని ఆయన చెప్పారు. 'ఈ సిస్టమ్ మారాలంటు చేసే ప్రయత్నంలో మీడియా కూడా సరిగా స్పందించదని, రైతులే కదా...రోజూ ఏదో ఒక ఇబ్బంది ఉంటుందని లైట్ తీసుకుంటారని, అలా కాదని వారి తరపున పోరాడడమే ఈ సినిమా' అని ఆయన చెప్పారు. 

More Telugu News