: ఆస్ట్రేలియా టెన్నిస్‌ క్రీడాకారుడు నిక్‌ లాండాపై ఏడేళ్ల నిషేధం, 35,000 డాలర్ల జరిమానా

ఆస్ట్రేలియాలో 2013లో నిర్వహించిన ఓ మ్యాచ్‌ ఫలితాన్ని ఉద్దేశ‌పూర్వ‌కంగా మార్చేశాడని ఆరోప‌ణ‌లు ఎదుర్కుంటున్న ఆ దేశానికే చెందిన‌ టెన్నిస్‌ క్రీడాకారుడు నిక్‌ లాండాపై వేటు ప‌డింది. ఈ కేసులో టెన్నిస్‌ ఇంటిగ్రిటీ యూనిట్‌ నిర్వహించిన దర్యాప్తులో ఆయ‌న నిర్దోషిగా నిరూపించుకోలేక‌పోయాడు. దీంతో నిక్‌ లాండాపై ఏడేళ్ల నిషేధంతో పాటు 35,000 డాలర్ల జరిమానా కూడా విధించారు. స‌ద‌రు ఆట‌గాడు విచార‌ణ‌లో భాగంగా ఫొరెన్సిక్‌ పరీక్షల నిమిత్తం త‌న‌ మొబైల్‌ ఫోన్‌ను ఇచ్చేందుకూ ఒప్పుకోలేద‌ని, దీంతో అతడు అవినీతికి పాల్పడ్డాడని నిర్ధారించి ఈ నిషేధం విధించామ‌ని సంబంధిత అధికారులు తెలిపారు. ఇదే మ్యాచ్‌కు సంబంధించిన కేసులో 2016లో ఆ దేశ న్యాయ‌స్థానం ఆయ‌న‌కు 1000 ఆస్ట్రేలియా డాలర్ల జరిమానా కూడా వేసింది. కాగా 2013లో నిక్ లాండ్‌ రిటైర్‌ కావడం విశేషం.

More Telugu News