: పాక్ 'నకిలీ' మిసైల్ ప్రయోగం.. అదంతా ఓ డ్రామా.. 'బాబర్ 3' ఓ పెద్ద కట్టుకథ!

పాకిస్థాన్ పెద్ద అబద్ధం ఆడింది. బాబర్ 3 క్షిపణిని ప్రయోగించామని పాకిస్థాన్ ఇటీవల గొప్పలు పోయింది. జలాంతర్గామి నుంచి భూ ఉపరితలంపై లక్ష్యాలను బాబర్ 3 క్షిపణి ఛేదిస్తుందని పాకిస్థాన్ ఘనంగా ప్రకటించింది. ఈ ప్రయోగం పాక్ చరిత్రగతిని మార్చేదని, ఇందుకు సైన్యాన్ని అభినందిస్తున్నామని, శత్రుదేశాన్ని సమర్థవంతంగా అడ్డుకోగలమని చెప్పేందుకు గర్విస్తున్నామని సాక్షాత్తు ఆ దేశాధినేత నవాజ్ షరీఫ్ ఆ సమయంలో పేర్కొన్నారు కూడా!

ఈ మేరకు పాక్ విజువల్స్ ను కూడా విడుదల చేసింది. ఇక్కడే ఆ దేశం తప్పులో కాలేసింది. ఈ విజువల్స్ పాకిస్థాన్ ఫేక్ క్షిపణి ప్రయోగాన్ని కళ్లకు కట్టినట్టు చూపించాయి. జలాంతర్గామి నుంచి నింగికెగసిన క్షిపణి తెల్లగా ఉండగా, ఉపరితలంపై లక్ష్యాన్ని ఛేదించిన సమయంలో ఈ క్షిపణి కాషాయవర్ణంలోకి మారింది. ఈ అద్భుతం ఎలా జరిగిందని శాస్త్రవేత్తలు బుర్రలు బద్దలుకొట్టుకుని ఆ వీడియోను పదేపదే చూడడంతో అది గ్రాఫిక్ మాయాజాలమని అర్థమైంది.

దీంతో పాకిస్థాన్ ప్రపంచాన్ని మోసం చేసిందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. బాబర్ 3 క్షిపణి ప్రయోగం పెద్ద అబద్ధమని, అగ్ని క్షిపణి ప్రయోగాన్ని ఓర్వలేని పాకిస్థాన్ బాబర్ 3 పేరుతో పెద్ద అబద్ధమాడిందని పలువురు పేర్కొంటున్నారు.

More Telugu News