MobiKwik: తమ వినియోగదారులకు ఆఫ‌ర్ ప్ర‌క‌టించిన మొబైల్‌ వ్యాలెట్‌ 'మొబిక్విక్‌'

దేశీయ మొబైల్‌ వ్యాలెట్‌ మొబిక్విక్ తమ వినియోగదారులకు ఓ ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది. పెట్రోలు బంకులు, ఎల్‌పీజీ గ్యాస్‌ చెల్లింపులను త‌మ వ్యాలెట్ ద్వారా చేస్తే సర్‌ఛార్జి వసూలు చేయబోమని పేర్కొంది. న‌గ‌దుర‌హిత లావాదేవీల దిశ‌గా తాము ప్రజలను ప్రోత్సహిస్తున్నామ‌ని ఈ సంద‌ర్భంగా తెలిపింది. అందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. మొబైల్‌ వ్యాలెట్‌ మొబిక్విక్ త‌మ సేవ‌ల‌ను దేశంలో 20కు పైగా నగరాల్లోని పెట్రోల్‌ బంకుల్లో అందిస్తోంది. అందులో హైద‌రాబాద్‌, ఢిల్లీ, ముంబయి కూడా ఉన్నాయి. ఆయా నగరాల్లోని ఇండియన్‌ ఆయిల్‌, భారత్‌ పెట్రోలియం, హిందుస్థాన్‌ పెట్రోలియం బంకుల్లో ఈ స‌దుపాయం ఉంది. ఇక ఇండియన్‌, భారత్‌, హెచ్‌పీ గ్యాస్‌లకు బిల్లుల చెల్లింపుల‌ను ఈ వ్యాలెట్ ద్వారా చేసుకోవ‌చ్చు.

More Telugu News