demonitisation: ఎస్‌బీఐ క‌న్నా తక్కువ వడ్డీరేటుకు గృహరుణాలు ఇస్తున్న బ్యాంక్!

పెద్దనోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకున్న త‌రువాత ఖాతాదారులు పెద్ద‌ ఎత్తున బ్యాంకుల్లో డ‌బ్బును జ‌మ చేయ‌డంతో దేశంలోని ఎన్నో బ్యాంకులు వడ్డీరేట్లను తగ్గిస్తున్నట్టు ప్రకటిస్తూ వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ క్రమంలో ఇండియాలో రెండవ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకయిన బ్యాంక్ ఆఫ్ బరోడా గృహరుణ వడ్డీ రేట్లలో స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) క‌న్నా చౌక రేట్లను అందిస్తున్న‌ట్లు తెలిపింది. గృహరుణ వడ్డీ రేట్లలో అన్ని బ్యాంకుల క‌న్నా అతిత‌క్కువ‌ వ‌డ్డీరేట్లను ఇచ్చే బ్యాంకుగా ఇప్ప‌టివ‌ర‌కు ఎస్‌బీఐ ఉంది.

ఆ బ్యాంకు గృహ‌ రుణాలపై 8.50 శాతం వడ్డీరేట్లను వసూలు చేస్తోంది. అయితే బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆఫర్ చేసే గృహ రుణాలపై వడ్డీరేట్లు 8.35 శాతంగా ఉన్నాయి. ఆ బ్యాంకులో వడ్డీరేట్లపై 70 బేసిస్ పాయింట్లను కట్ చేయడంతో ఈ రేట్లు 8.35 శాతానికి దిగొచ్చాయని ఆ బ్యాంకు అధికారులు తెలిపారు. బ్యాంకుల్లో రుణం ఇచ్చే ముందు ఖాతాదారుడి గ‌త రుణ వివ‌రాల‌ చెల్లింపుల ఆధారంగా లెక్కగట్టే సిబిల్ స్కోర్ మెరుగ్గా ఉన్న కస్టమర్లకే ఈ వడ్డీరేట్లు త్వరగా అందుబాటులో ఉంటాయ‌ని పేర్కొన్నారు. అంతేగాకుండా ఏ బ్యాంకుల్లోనూ లేని స‌దుపాయాన్ని కూడా త‌మ బ్యాంకు అందిస్తుంద‌ని, ఎటువంటి ఛార్జీలు అవసరం లేకుండానే బేస్రేట్లతో లింక్ అయిన రుణాలు, కొత్త ఎంసీఎల్ఆర్లోకి మార్చుకునే వెసులుబాటును కూడా క‌ల్పిస్తున్నామ‌ని ఆ బ్యాంకు అధికారులు తెలిపారు.

More Telugu News