: ఐటీ, ఈడీ దెబ్బకు వణుకుతున్న అర్బన్ బ్యాంక్ చైర్మన్లు... నోట్ల రద్దు అనంతర పరిస్థితులపై అత్యవసర చర్చ!

నవంబర్ 8న ప్రధాని నోట్ల రద్దు ప్రకటన చేసిన అనంతరం, భారీ స్థాయిలో నల్లధనం జిల్లా సహకార బ్యాంకులకు చేరిందన్న వాస్తవాన్ని ఆదాయపు పన్ను శాఖ, సీబీఐ, ఈడీలు కనిపెట్టడంతో వణికిపోతున్న బ్యాంకుల చైర్మన్లు ఈ ఉదయం అత్యవసర భేటీ నిర్వహించారు. గుంటూరులో జరిగిన ఓ సమావేశానికి ఏపీలోని 13 జిల్లాల అర్బన్ బ్యాంకు చైర్మన్లతో పాటు అందుబాటులోని తెలంగాణ జిల్లాల చైర్మన్లూ హాజరై నోట్ల రద్దు తదనంతర పరిస్థితులపై చర్చించారు.

అర్బన్ బ్యాంకుల్లో దాదాపు రూ. 45 వేల కోట్లకు పైగా డిపాజిట్లు జరిగినట్టు వార్తలు వచ్చిన నేపథ్యంలో, అనుమానిత అన్ని ఖాతాల సమాచారాన్ని ఐటీ సేకరిస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని డిపాజిట్లు, నోట్ల మార్పిడి వెనుక బ్యాంకుల చైర్మన్ల పాత్ర ఉన్నట్టు కూడా ఉన్నతాధికారులు అనుమానిస్తుండటంతో, ఈ బ్యాంకుల చైర్మన్లు, ఇతర అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. కాగా, ఈ సమావేశంలో భవిష్యత్ పరిణామాలు, వాటిపై బ్యాంకులు తీసుకోవాల్సిన చర్యలపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది.

More Telugu News