rbi: మే నెల‌లోనే రూ.2000 నోటుపై నిర్ణయం... నోట్లరద్దు విషయం మాత్రం ప్రస్తావనకు రాలేదు: ఆర్‌బీఐ

పెద్ద‌నోట్ల ర‌ద్దు అంశం నేప‌థ్యంలో స‌మాచార హ‌క్కు చ‌ట్టాన్ని ఉప‌యోగిస్తూ ‘ఇండియన్‌ ఎక్స్ ప్రెస్’ అడిగిన ప‌లు ప్ర‌శ్న‌ల‌కు రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సమాధానం ఇచ్చింది. పెద్ద నోట్ల ర‌ద్దు అనంత‌రం రెండు వేల రూపాయల నోట్లను చలామణిలోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే వాటిని చలామణిలోకి తీసుకురావాల‌ని తాము గతేడాది మే నెలలోనే నిర్ణయం తీసుకున్న‌ట్లు ఆర్‌బీఐ పేర్కొంది. ఆ సమయంలో రూ.500, 1000 నోట్ల రద్దు విషయం ప్రస్తావనకు రాలేదని స్ప‌ష్టం చేసింది. రూ.2000 నోట్లను తీసుకురావ‌డానికి సెంట్రల్ బోర్డు గ‌త ఏడాది మే 19న గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింద‌ని తెలిపింది.
అనంత‌రం జూలై 7, ఆగస్టు 11న జరిగిన బోర్డు సమావేశాల్లో కూడా పెద్దనోట్ల ర‌ద్దుపై తాము ఎలాంటి చ‌ర్చ‌లూ జ‌ర‌ప‌లేద‌ని పేర్కొంది.

rbi

More Telugu News