: గంగూలీకి బెదిరింపు లేఖ‌.. యూనివ‌ర్సిటీ కార్య‌క్ర‌మానికి హాజ‌రుకావ‌ద్దంటూ హెచ్చ‌రిక‌

భార‌త మాజీ కెప్టెన్‌, బెంగాల్ క్రికెట్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు సౌర‌భ్ గంగూలీని హెచ్చ‌రిస్తూ ఓ గుర్తుతెలియ‌ని వ్య‌క్తి బెదిరింపు లేఖ పంపాడు. ఓ యూనివ‌ర్సిటీ నిర్వ‌హిస్తున్న కార్య‌క్ర‌మానికి హాజ‌రు కావ‌ద్ద‌ని, కాదుకూడ‌ద‌ని హాజ‌రైతే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుందంటూ అందులో హెచ్చ‌రిక‌లు జారీ చేశాడు. త‌న‌కు జ‌న‌వ‌రి 7న‌ బెదిరింపు లేఖ వ‌చ్చిన మాట వాస్త‌వ‌మేన‌ని దాదా తెలిపాడు. ఈ విష‌యాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లిన‌ట్టు పేర్కొన్నాడు. ప‌శ్చిమ‌బెంగాల్‌లోని మేదినీపూర్‌లో ఈనెల 19న జిల్లా  క్రీడా సంఘంతో క‌లిసి విద్యాసాగ‌ర్ యూనివ‌ర్సిటీ సంయుక్తంగా ఓ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తోంది. దీనికి గంగూలీని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఈ నేప‌థ్యంలో ఆ కార్య‌క్ర‌మానికి హాజ‌రుకావ‌ద్దంటూ దాదాకు లేఖ అందింది.  అయితే బెదిరింపు లేఖ నేప‌థ్యంలో కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యేది, లేనిది గంగూలీ స్ప‌ష్టం చేయ‌లేదు.

More Telugu News