: ఏపీలో ‘గౌతమిపుత్ర శాతకర్ణి’కి వినోదపు పన్ను మినహాయింపు

ప్రముఖ నటుడు బాలకృష్ణ వందో చిత్రం ‘గౌతమి పుత్ర శాతకర్ణి’కి వినోదపు పన్నును మినహాయిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. చారిత్రక నేపథ్యంలో నిర్మించిన ఈ చిత్రానికి పన్ను మినహాయింపు ఇవ్వాలని కోరడంతో, అందుకు సానుకూలంగా స్పందించిన ఏపీ ప్రభుత్వం ఈ మేరకు ప్రకటన చేసింది. కాగా, తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ చిత్రానికి పన్ను మినహాయింపును ఇస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా, సంక్రాంతి పండగకు ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ ప్రేక్షకుల ముందుకు రానుంది. 

More Telugu News