: ప్రతిఏటా జరిగేలా సంక్రాంతి జరుపుకోండి: ఏపీ ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్

సంక్రాంతి ప్రతిఏటా జరుపుకునేలా ఈ ఏడు కూడా నిర్వహించుకోవాలని ఏపీ ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ ప్రజలను కోరారు. ఏలూరులో ఆయన మాట్లాడుతూ, సుప్రీంకోర్టు నిబంధనలకు లోబడి పండగ చేసుకోవాలని సూచించారు. కోళ్ల కాళ్లకు కత్తులు కట్టవద్దని ఆయన తెలిపారు. దెబ్బలాడుకోవడం కోళ్ల నైజమని, వాటిని చూసేందుకు భారీ సంఖ్యలో జనాలు గుమిగూడతారని ఆయన తెలిపారు. అది తప్పు కాదని, కోళ్ల కాళ్లకు కత్తులు కట్టడం, పందేలు నిర్వహించడం తప్పని ఆయన అన్నారు.

అలాంటి వాటికి దూరంగా ఉంటూ సంక్రాంతి పండగను నిర్వహించుకోవాలని, ప్రతిఏటా నిర్వహించుకునేలా నిర్వహించుకోవాలని ఆయన తెలిపారు. అలాగే పోలీసులు కూడా సుప్రీం ఆదేశాలు శిరసావహించాలని సూచించారు. కోళ్లను పట్టుకెళ్లవద్దని ఆయన సూచించారు. పోలీసుల్ని జోక్యం చేసుకోవద్దని సుప్రీంకోర్టు చెప్పిందని, వారు ఆ విధంగా చేయాలని ఆయన తెలిపారు. కోళ్లకు దేవుడు దెబ్బలాడుకోవడం సహజంగా ఇచ్చాడని, దానిని మనం ఆపడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. 

More Telugu News