mc donald: చైనా, హాంకాంగ్‌లలో రూ.14 వేల కోట్లకు మెక్‌డొనాల్డ్స్‌ విక్రయం

అమెరికాకు చెందిన ఫాస్ట్‌ఫుడ్ కంపెనీ మెక్‌డొనాల్డ్స్ చైనా, హాంకాంగ్‌లలో త‌మ వ్యాపారాన్నిమ‌రింత విస్త‌రించుకుంది.
సిటిక్‌ గ్రూప్‌, కార్లీ గ్రూప్‌ కన్సార్టియంకు అక్కడి ఫ్రాంచైజీల వ్యాపారాన్ని 2.08 బిలియన్‌ డాలర్లు (రూ.14వేల కోట్లు)కు విక్ర‌యించిన‌ట్లు ఈ రోజు ప్ర‌క‌టించింది. చైనా, హాంకాంగ్‌లలో సిటిక్‌ లిమిటెడ్‌, సిటిక్‌ క్యాపిటల్‌ హోల్డింగ్స్‌, కార్లీ గ్రూప్‌, మెక్‌డొనాల్డ్స్‌ కలిసి ఒక కంపెనీని ఏర్పాటు చేశాయని, ఇది అక్కడి వ్యాపారాల‌కు బాధ్యత వహిస్తుంద‌ని చెప్పింది. తాము చేసుకున్న ఈ ఒప్పందం 20 ఏళ్లపాటు అమల్లో ఉంటుందని పేర్కొంది.


More Telugu News