: జయలలిత మృతిపై సమగ్ర నివేదిక కావాలి... తమిళనాడు ప్రభుత్వానికి మద్రాసు హైకోర్టు నోటీసులు

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతిపై అనుమానాలున్నాయంటూ మ‌ద్రాసు హైకోర్టులో దాఖ‌లైన పిటిష‌న్ ఈ రోజు విచార‌ణ‌కు వ‌చ్చింది. ఈ పిటిష‌న్‌పై వాద‌న‌లు విన్న హైకోర్టు అనంత‌రం త‌మిళ‌నాడు స‌ర్కారుకి నోటీసులు జారీ చేసింది. వ‌చ్చేనెల 23లోపు జ‌య‌ల‌లితకు అందించిన చికిత్స‌, మృతికి సంబంధించిన వివరాలపై సమ‌గ్ర‌నివేదిక‌ను సీల్డ్ క‌వ‌రులో త‌మకు ఇవ్వాల‌ని ప్ర‌భుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాల ప‌ట్ల స్పందించిన ప్రభుత్వ త‌ర‌ఫు న్యాయ‌వాది జ‌య‌ల‌లిత‌కు అందించిన చికిత్సపై నివేదిక ఇవ్వ‌డానికి సిద్ధ‌మేన‌ని పేర్కొన్నారు.

More Telugu News