suicide: పంజాగుట్ట ఫ్లై ఓవర్‌పై క్యాబ్ డ్రైవ‌ర్ ఆత్మ‌హ‌త్యాయ‌త్నం

ఉబెర్‌, ఓలా య‌జ‌మాన్యాలు త‌మ ప‌ట్ల ప్ర‌ద‌ర్శిస్తున్న తీరుప‌ట్ల నిర‌స‌గా హైద‌రాబాద్‌లో ఆ కంపెనీల క్యాబ్ డ్రైవ‌ర్‌లు చేస్తోన్న‌ ఆందోళ‌న కొన‌సాగుతోంది. ఈ ప‌రిస్థితుల్లో ప‌లు చోట్ల ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొంటున్నాయి. ఈ రోజు ఉద‌యం న‌గ‌రంలోని పంజాగుట్ట ఫ్లై ఓవర్‌పై ఓ క్యాబ్ డ్రైవ‌ర్ ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేశాడు. గ‌మ‌నించిన పోలీసులు అత‌డిని అడ్డుకొని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేష‌న్‌కి త‌ర‌లించారు. ఆ డ్రైవ‌ర్ పేరు ర‌మేష్ అని పోలీసులు తెలిపారు. మరోపక్క, త‌మ యాజ‌మాన్యాలు దిగి వ‌చ్చేవ‌ర‌కు త‌మ ఆందోళ‌న‌ను ఆప‌బోమ‌ని క్యాబ్ డ్రైవ‌ర్‌లు అంటున్నారు.

More Telugu News