: ముందు ముందు మరి కొన్ని కష్టాలు రావచ్చు... అభివృద్ధి కోసం తప్పదన్న వెంకయ్యనాయుడు

దేశ భవిష్యత్తు, వృద్ధి రేటును కాపాడుకునేందుకు మరిన్ని కీలక సంస్కరణలను కేంద్ర ప్రభుత్వం తేనుందని, వీటి కారణంగా ప్రజలకు కొన్ని కష్టాలు ఎదురైనా, అది తాత్కాలికమేనని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. విశాఖపట్నంలో ఈ ఉదయం ఈ గవర్నెన్స్ పై జాతీయ సదస్సు ప్రారంభం కాగా, సీఎం చంద్రబాబుతో కలసి వెంకయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, అభివృద్ధిలో చైనాతో పోలిస్తే భారత్ దూసుకెళ్తోందని అన్నారు.

ఇండియాలో ఏడు శాతానికి పైగా వృద్ధి రేటు నమోదవుతోందని గుర్తు చేసిన వెంకయ్య, త్వరలో మరిన్ని సంస్కరణలు చేయాల్సిన అవసరముందని చెప్పుకొచ్చారు. ఇండియా అభివృద్ధి సాధిస్తోందని మోదీ చెప్పడం లేదని, అంతర్జాతీయ రేటింగ్ సంస్థలే ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయని అన్నారు. అవినీతిపై మోదీ యుద్ధం ప్రకటించారని, ఈ యుద్ధంలో గెలిచేది ఆయనేనని తెలిపారు. దేశంలో నల్లధనాన్ని అరికట్టేందుకే నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నామని, ఆర్థికంగా ఎదిగేందుకు ఎన్నో అవకాశాలు మన ముందున్నాయని వెంకయ్య అభిప్రాయపడ్డారు.

More Telugu News