: చిరంజీవి, పవన్ కల్యాణ్ కాంబినేషన్ లో ఓ సినిమా నిర్మిస్తున్నా.. రాంచరణ్, బన్నీలు ముఖ్య పాత్రలు పోషిస్తారు: టి.సుబ్బరామిరెడ్డి

మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ల కాంబినేషన్ లో ఒక సినిమా నిర్మించనున్నామని, స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నామని ప్రముఖ నిర్మాత టి.సుబ్బరామిరెడ్డి చెప్పారు. చిరంజీవి ఇప్పటికే అంగీకరించారని, పవన్ కల్యాణ్ నుంచి డేట్స్ ఫైనల్ కావాల్సి ఉందని అన్నారు. ఈ సినిమాలో రాంచరణ్, బన్నీ కూడా ముఖ్యపాత్రలు పోషిస్తారని, ‘విశాఖ’ చుట్టూ కథ తిరిగేలా స్క్రిప్ట్ రూపొందిస్తున్నామని  చెప్పారు. గతంలో వచ్చిన ‘స్టేట్ రౌడీ’, ‘జీవనపోరాటం’ సినిమాల కంటే త్వరలో తీయబోయే ఈ సినిమా భారీ హిట్ అవుతుందని ఆశిస్తున్నామని సుబ్బరామిరెడ్డి అభిప్రాయపడ్డారు.

More Telugu News