: ఈరోజు అర్ధరాత్రి నుంచి పెట్రోల్ బంకుల్లో క్రెడిట్, డెబిట్ కార్డులను అంగీకరించరు!

ఈరోజు అర్ధరాత్రి నుంచి తెలంగాణలోని పెట్రోల్ బంకుల్లో డెబిట్, క్రెడిట్ కార్డుల లావాదేవీలు నిలిచిపోనున్నాయి. కార్డుల చెల్లింపులపై వసూలు చేయాల్సిన అదనపు ఛార్జీలను డీలర్ల నుంచి వసూలు చేయాలని నిర్ణయించడాన్ని నిరసిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇండియన్ పెట్రోలియం డీలర్స్ సంఘం కార్యదర్శి అమరమ్ రాజీవ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డీజిల్ పై 2.5 శాతం, పెట్రోల్ పై 3.2 శాతం చొప్పున డీలర్లకు కమిషన్ వస్తుందని, అందులో నుంచి అదనపు ఛార్జీలు వసూలు చేయాలని నిర్ణయించడాన్ని ఆయన తప్పుబట్టారు. తమ లావాదేవీల్లో అధిక శాతం కార్డుల ద్వారానే జరుగుతున్నాయని చెప్పారు. ఇలాంటప్పుడు అదనపు ఛార్జీలు డీలర్ల వద్ద వసూలు చేస్తామంటే ఎలాగని ప్రశ్నించారు. ఈరోజు అర్ధరాత్రి నుంచి డెబిట్ లేదా క్రెడిట్ కార్డులను బంకుల్లో అనుమతించమన్న విషయాన్ని వినియోగదారులకు తెలియజేస్తూ ఆయా పెట్రోల్ బంకుల్లో బ్యానర్లు వెలిశాయి. 

More Telugu News