: వారందరికీ దండేసి దండం పెడుతున్న జీహెచ్ఎంసీ

హైదరాబాద్ నగరాన్ని మరింత పరిశుభ్రంగా మార్చేందుకు నడుం బిగించిన జీహెచ్ఎంసీ అధికారులు, పారిశుద్ధ్య కార్మికులు నేడు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. బహిరంగ మూత్ర విసర్జన చేస్తున్న వారిని గుర్తించి, చప్పట్లు కొడుతూ వారి వద్దకు వెళ్లి, మెడలో దండేసి, దండం పెడుతున్నారు. స్వచ్ఛ హైదరాబాద్ కోసం 550 పబ్లిక్ టాయిలెట్లను అందుబాటులో ఉంచినా, ఇంకా పలువురు బహిరంగంగా మూత్ర విసర్జన చేస్తున్నారని, వీరిలో విద్యాధికులు కూడా ఉండటం కలవరపెడుతోందని అధికారులు అంటున్నారు. ఈ పరిస్థితిని నివారించేందుకే ఇలా వినూత్న నిరసన తెలియజేస్తున్నట్టు పేర్కొన్నారు. నేడు కోటి, ఛాదర్ ఘాట్, అబీడ్స్ ప్రాంతాల్లో తిరుగుతూ, రోడ్ల పక్కన ఆ పని చేసేందుకు వచ్చిన వారిని పట్టుకుని పూల దండలు వేస్తున్నారు. ఇక ఇప్పుడైనా ఇలాంటి పనులు ఆపేస్తారన్నది తమ అభిమతమని అధికారులు తెలిపారు.

More Telugu News