: పీఐఓ కార్డులను ఓసీఐలుగా మార్చుకోండి: ప్రవాస భారతీయులకు మోదీ కీలక సూచన

విదేశాల్లో ఉంటున్న భారతీయులు తమకున్న పీఐఓ (పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజన్) కార్డులను ఓసీఐ (ఓవర్సీస్ ఇండియన్ సిటిజన్స్)లుగా మార్చుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. కార్డుల కన్వర్షన్ కు గతంలో విధించిన డిసెంబర్ 31, 2016 డెడ్ లైన్ ను ఈ సంవత్సరం జూన్ 30 వరకూ పొడిగిస్తున్నట్టు తెలిపారు. ప్రవాస భారతీయ దివస్ లో ప్రసంగించిన ఆయన, భారత ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ప్రవాస భారతీయులు ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. వారి నుంచి ఇండియాకు వస్తున్న సంపద 69 బిలియన్ డాలర్లకు చేరిందని తెలిపారు. ఇండియాలో మేధోవృద్ధికి ప్రవాసులు తమవంతు సహకారాన్ని అందించాలని సూచించారు. తన దృష్టిలో 'ఎఫ్డీఐ'కి రెండు అర్థాలున్నాయని, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్ తో పాటు ఫస్ట్ డెవలప్ ఇండియా అని కూడా అనుకోవాలని అన్నారు.

More Telugu News