: పోర్చుగల్ ఔషధ మార్కెట్ అధినేతగా అరబిందో ఫార్మా

పోర్చుగల్ కు చెందిన జెనరిక్ ఔషధ సంస్థ జనరిక్స్ ఫార్మాస్యుటికాను రూ. 969.30 కోట్లను వెచ్చించి విలీనం చేసుకోవడంతో అరబిందో ఫార్మా ఆ దేశ ఔషధ రంగంలో అతిపెద్ద సంస్థగా అవతరించింది. అరబిందో నెదర్లాండ్స్ అనుబంధ ఏజిల్ ఫార్మా ఈ డీల్ ను పూర్తి చేసింది. పోర్చుగల్ లోని అమదోరాలో ఉన్న ప్లాంటు నుంచి సాలీనా 1.2 బిలియన్ టాబ్లెట్లను ఉత్పత్తి చేయగలుగుతుందని, ఆ దేశపు మార్కెట్లో 271 రకాల ఔషధాలను తాము మార్కెటింగ్ చేయనున్నామని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా, యూరప్ లో అరబిందో ఫార్మా చేసుకున్న రెండో అతిపెద్ద డీల్ ఇది.

More Telugu News