: డిసెంబర్ 31న 1400 కోట్ల వాట్స్ యాప్ మెసేజ్ లు వెళ్లాయట!

మెసేజ్ లకు ప్రత్యేకంగా రుసుం వసూలు చేస్తూ, వ్యాపారం సాగిస్తున్న టెలికాం సంస్థల హవాకు, ఆదాయానికి గండికొడుతూ, ఇప్పుడు వాట్స్ యాప్, మెసేంజర్ వంటి యాప్ లు దూసుకుపోతున్నాయి. డిసెంబ‌ర్ 31న ఒక్క‌రోజే దేశ‌వ్యాప్తంగా వాట్స‌ప్ నుంచి 1400 కోట్ల మెసేజ్‌లు వెళ్లాయని గణాంకాలు చెబుతున్నాయి. ఆ ఒక్క రోజే 310 కోట్ల ఇమేజెస్‌, 70 కోట్ల జిఫ్స్‌, 61 కోట్ల వీడియోలు షేర్ చేసుకున్నారని వాట్స్ యాప్ తెలిపింది. ఇది వాట్స్ యాప్ చ‌రిత్ర‌లోనే అసాధార‌ణ‌మ‌ైన ఎదుగుదల అని ఆ సంస్థ తెలిపింది. దీంతో  ఇండియాలో సాంప్ర‌దాయ మెసేజ్‌ ల‌కు ఇక కాలం చెల్లిన‌ట్లే క‌నిపిస్తోందని నిపుణులు పేర్కొంటున్నారు.

రీసెర్చ్ కంపెనీ ఓవ‌మ్ గణాంకాల ప్ర‌కారం 2016లో టెలికాం కంపెనీలు 310 కోట్ల డాల‌ర్ల ఆదాయాన్ని కోల్పోయాయట. ఈ లెక్కన న్యూఇయర్ రోజున ఎంత ఆదాయం కోల్పోయాయో అన్న అనుమానం వ్యక్తమవుతోంది. కాగా, ఇప్పుడు వాట్స్ యాప్ దైనందిన జీవితంలో ఒక భాగ‌మైపోయింది. పండుగ‌లు, పుట్టినరోజులు, ఇతర వేడుకలు సెలబ్రేట్ చేసుకోవాల‌నుకున్నా, ఫ్రెండ్స్‌, కుటుంబ స‌భ్యులు, బంధువుల‌తో సంబంధాలు నెరపాలన్నా అత్యధికులు వాట్స్ యాప్ పై ఆధారపడ్డారని ఆ సంస్థ పేర్కొంది. తమకు ఇండియాలో 16 కోట్ల యూజర్లు ఉన్నారని వాట్స్ యాప్ తెలిపింది. ఇది రష్యా జనభా కంటే ఎక్కువ కావడం విశేషం. 

More Telugu News