facebook: ఫేస్‌బుక్‌లో యువ‌తికి వేధింపులు... యువ‌కుడిపై కేసు న‌మోదు.. రౌడీషీట్‌ ఓపెన్‌

సోష‌ల్ మీడియా వెబ్‌సైట్ ఫేస్‌బుక్ ద్వారా ఓ యువ‌తిని వేధించిన ఓ యువ‌కుడిని జవహర్‌నగర్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి అతనిపై రౌడీషీట్‌ ఓపెన్‌ చేశారు. వివ‌రాల్లోకి వెళితే... కరీంనగర్‌ జిల్లా రామగుండం వాసి అయిన జీవన్‌శర్మ (24) త‌మ ప్రాంతంలోనే ఉండే పీజీ విద్యార్థిని సునీత మోహన్‌తో ప‌రిచ‌యం పెంచుకున్నాడు. అనంత‌రం సునీతకు హైదరాబాద్‌లోని హెచ్‌ఎస్‌బీసీలో ఉద్యోగం అభించ‌డంతో అల్వాల్‌ మండలంలోని మచ్చబొల్లారం ప్రాంతానికి వెళ్లారు. మ‌రోవైపు జీవ‌న్‌శ‌ర్మ‌ రామగుండంలోనే ప్రైవేట్‌ కంపెనీ పెట్టుకున్నాడు. అయితే, కొంత కాలంగా సునీతకు జీవ‌న్‌శ‌ర్మ మెసేజ్‌లు పంపుతూ ప్రేమించాలని వేధిస్తున్నాడు. దీంతో ఆ యువ‌తి కుటుంబసభ్యులు ఏప్రిల్ 9,  2016 లో జవహర్‌నగర్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

అయినా బుద్ధి తెచ్చుకోని జీవన్‌శర్మ మరింతగా వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో ఆ యువ‌తి కుటుంబ స‌భ్యులు మ‌రోసారి సెప్టెంబర్ 3, 2016న అతనిపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు మరో కేసు నమోదు చేసుకుని అత‌డిపై రౌడీషీట్‌ తెరిచి రామగుండం పోలీసులకు సమాచారం అందించారు. రౌడీషీట్ ఓపెన్ చేసిన‌ప్ప‌టికీ బుద్ధి తెచ్చుకోని జీవ‌న్‌శ‌ర్మ‌ ఫేస్‌బుక్‌లో సునీతా మోహన్‌కు సంబంధించిన వ్యక్తిగత విషయాలను అసభ్యకరంగా పోస్టులు చేస్తున్నాడు. దీంతో మూడు రోజుల క్రితం ఐటీ చట్టం ఐపీసీ 66సి ప్రకారం అత‌డిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిన్న అరెస్టు చేసి జవహర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌కు తీసుకువ‌చ్చారు. అనంత‌రం అత‌డిని రిమాండ్‌కు తరలించారు.

More Telugu News